AP Minority Corporation Loans 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మైనారిటీ వర్గాల కోసం సబ్సిడీ రుణాలు మళ్ళీ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ మైనారిటీ కార్పొరేషన్ లోన్స్ 2025 ద్వారా నిరుద్యోగ యువతకి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడమే ముఖ్య ఉద్దేశ్యం. ఇప్పుడు ఈ లోన్‌కు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. ఎలా దరఖాస్తు చేయాలో, ఏఏ డాక్యుమెంట్లు అవసరమో ఇప్పుడు చూద్దాం.

AP Minority Corporation Loans 2025 Overview
| అంశం | వివరాలు |
|---|---|
| పథకం పేరు | ఆంధ్రప్రదేశ్ మైనారిటీ కార్పొరేషన్ లోన్స్ 2025 |
| ప్రారంభించినది | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం |
| దరఖాస్తు విధానం | ఆన్‌లైన్ |
| లబ్ధిదారులు | మైనారిటీ వర్గానికి చెందిన నిరుద్యోగ యువత |
| సబ్సిడీ మొత్తం | 50% వరకు (₹1 లక్ష నుంచి ₹8 లక్షల వరకు) |
| అధికారిక వెబ్‌సైట్ | https://apobmms.apcfss.in |
ఆంధ్రప్రదేశ్ మైనారిటీ లోన్స్ 2025 అంటే ఏమిటి?
AP మైనారిటీ కార్పొరేషన్ లోన్స్ 2025 పథకం ద్వారా మైనారిటీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు స్వంత వ్యాపారాలు స్థాపించడానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోంది. రూ. 1 లక్ష నుండి 8 లక్షల వరకు యూనిట్ ఖర్చుపై 50% సబ్సిడీ లభిస్తుంది. ఇది తమ స్వయం ఉపాధికి మద్దతుగా ఉపయోగపడుతుంది.
కావాలిన అర్హతలు
ఈ పథకానికి దరఖాస్తు చేయాలంటే దరఖాస్తుదారులు కచ్చితంగా ముస్లిం, క్రిస్టియన్, సిఖ్, బౌద్ధ, జైన, పార్సీ వర్గాలకు చెందినవారై ఉండాలి. వయసు 21 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల మధ్య ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ.1.5 లక్షలు లోపు ఉండాలి, పట్టణాల్లో రూ.2 లక్షలు లోపు ఉండాలి. కొన్ని ప్రత్యేక పథకాల కోసం డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఫార్మసీ డిగ్రీలు అవసరం.
దరఖాస్తు కోసం అవసరమైన డాక్యుమెంట్లు
దరఖాస్తు సమయంలో ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆధార్ కి లింక్ అయిన మొబైల్ నంబర్, బ్యాంక్ పాస్ బుక్, ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, విద్యార్హత సర్టిఫికేట్లు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో తప్పనిసరిగా అవసరం. అన్ని వివరాలు నిజమైనవి మరియు సరైనవి ఉండాలి.
ఆన్లైన్‌లో ఎలా అప్లై చేయాలి?
ముందుగా అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. అందులో For Registration అనే ఆప్షన్ పై క్లిక్ చేసి, మీ మొబైల్ నంబర్, జిల్లా వివరాలు నమోదు చేయాలి. మొబైల్‌కు వచ్చిన OTP ద్వారా లాగిన్ కావాలి. తర్వాత వ్యక్తిగత వివరాలు, విద్యా వివరాలు, అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి, చివరికి సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ నంబర్‌ను సేవ్ చేసుకోవడం మరువకండి.
ఆంధ్రప్రదేశ్ మైనారిటీ లోన్స్ 2025 ముఖ్య విశేషాలు
ఈ పథకం ద్వారా మైనారిటీ యువత తక్కువ వడ్డీతో తమ వ్యాపారాలను ప్రారంభించడానికి ఆర్థిక సాయం పొందవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ లేదా వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుంది. దీనివల్ల మైనారిటీ వర్గాల ఆర్థిక స్థితి మెరుగుపడటమే ప్రభుత్వ ధ్యేయం.
FAQs About Andhra Pradesh Minority Corporation Loans 2025
Only residents of Andhra Pradesh belonging to minority communities are eligible.
Applicants must be between 21 and 55 years old.
The subsidy can be up to 50% of the unit cost, depending on the scheme.
Aadhar card, ration card, income certificate, caste certificate, education certificates, and bank passbook.
No, the application process is completely online via the official portal.
Advertisement
